BB6 TELUGU NEWS CHANNEL
చంద్రనాయక్ తండాలోని MBS అపార్ట్మెంట్పై కూకట్పల్లి SOT మెరుపుదాడి జరుపగా. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు .ప్రధాన నిందితుడు,డ్రగ్స్ పెడ్లర్ తరుణ్ అరెస్ట్. మరో ఇద్దరు సరఫరాదారులు కార్తీక్,పృథ్వి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 15 గ్రాముల MDMA,300 గ్రాముల OG Kush గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలతో పాటు 9 మొబైల్ ఫోన్లు,2 డిజిటల్ వెయింగ్ మెషీన్లు,ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.43.30 లక్షలు కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న మాదాపూర్ పోలీసులు.
మాదాపూర్లో డ్రగ్స్ పార్టీ.. రూ.43.30 లక్షల మాదకద్రవ్యాలు స్వాధీనం
15
Jun