బోయపల్లి యాదమ్మ PHN గా ప్రమోషన్ పదవి విరమణ ( Retirement ) వీడ్కోలు..

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాదమ్మ పదవి విరమణ వీడ్కోలు ఘనంగా నిర్వహించారు.
వృత్తిలో పదవీ విరమణ (Retirement) అనేది ఒక సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు, అలాగే కొత్త జీవితానికి నాంది. ఈ సందర్భంలో ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు పలకడం, వారి సేవలను అభినందించడం ఒక ఆనవాయితీ. వృత్తిలో నిబద్ధత కలిగిన బోయపల్లి యాదమ్మ భర్త బోయపల్లి శంకర్ గౌడ్ స్వగ్రామం మహమ్మదాబాద్.

తల్లి సత్యమ్మ , తండ్రి నడిమింటి (గూడెం) నారాయణ , ఏడుగురు సంతానంలో ఇద్దరు అక్క చెల్లెలు ఐదుగురు అన్నదమ్ములు. మొదటి సంతానంగా యాదమ్మ.1965 Anm గా ఆంధ్రమహిళ సభ హైదరాబాద్ లో శిక్షణ పొంది ఏఎన్ఎం గా 1991 దౌల్తాబాద్ లో తన మొదటి ప్రస్థానం ( ఉద్యోగం ) మొదలైంది. 3 సంవత్సరాల తరువాత హన్వాడ లో 1993 నుండి 2008 anm కొనసాగింది. 2008 లో నవాబ్పేట్ పిఎస్సి లో ఔట్ పేషెంట్ ఏఎన్ఎమ్ గా బాధ్యతలు నిర్వహించి నవాబ్పేట్ మండలం చౌడూరు లో 2009 2013 ఉద్యోగం కొనసాగింది. 2013లో మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ గా ప్రమోషన్ పొంది నారాయణపేట జిల్లా మాగనూరు పిఎస్సి లో బాధ్యతలను చేపట్టింది. అక్కడే 13 సంవత్సరాలు ఉద్యోగంలో కొనసాగి సాధారణ బదిలీ లో భాగంగా 2024 లో గండీడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీ పర్పస్ హెల్త్ సూపర్వైజర్ గా చేరి 27 ఏప్రిల్ 2026 లో పబ్లిక్ హెల్త్ నర్స్ (phn) ప్రమోషన్ పొంది 30 ఏప్రిల్ 2026 పదవీ విరమణ చేశారు.

గండీడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ మరియు స్టాప్ అందరూ యాదమ్మకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe