BB6 TELUGU NEWS CHANNEL
ఎమర్జెన్సీలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే 108 అంబులెన్స్‌ను కొందరు యువకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఏకంగా అంబులెన్స్‌ను మూవింగ్ ఓయోగా మార్చి అందులో అసభ్య కార్యకలాపాలు సాగించారు. తాజాగా ఓ యువతి, ఇద్దరు యువకులు అంబులెన్స్‌లో అసభ్యకర పనులు చేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాధారణంగా అంబులెన్స్‌ను ఎందుకు ఉపయోగిస్తారు. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెంటనే హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌ను ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ కొందరు యువకులు మాత్రం ప్రజారోగ్యానికి బాసటగా నిలిచిన 108 అంబులెన్స్‌ను ఏకంగా ఓయోరూమ్‌గా మార్చేశారు. అందులో అసభ్యకరంగా రొమాన్స్ చేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది.రోడ్డుపై వెళ్తున్న ఓ అంబులెన్స్‌లో యువతి ఇద్దరు యువకులు అసభ్యకరంగా రొమాన్స్ చేయడం కిటిలోంచి స్థానికులకు కనిపించింది. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ అంబులెన్స్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర అంబులెన్స్‌ను వెంబడించి చివరికి ఆపేశారు. అంబులెన్స్ డోర్ తిసి చూడగా అందులో ఓ యువతి ఇద్దరు యువకులు కనిపించారు.
అంబులెన్స్‌లో అడ్డంగా బుక్కైన యువతి, ఇద్దరు యువకులు ఇదిగో వీడియో
Viral Video: అంబులెన్స్‌ను ఓయోగా మార్చిన కిలాడీలు..
24
Apr