గండీడ్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
మహాబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల గ్రామం పంచాయతీలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జరుపుకుంటారు. ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త, రచయిత మరియు కుల వ్యతిరేక పోరాట యోధుడు జ్యోతిరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన మహిళా విద్య, దళితుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు..

ముఖ్య విషయాలు :
• జననం: 11 ఏప్రిల్ 1827, పూణే, మహారాష్ట్ర.
• సామాజిక సేవ: మహిళలకు మరియు వెనుకబడిన వర్గాల వారికి విద్యను అందించడానికి కృషి చేశారు.
• సత్యశోధక్ సమాజ్: సమానత్వం కోసం 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ (సత్య అన్వేషకుల సంఘం) స్థాపించారు.
• భార్య: సావిత్రిబాయి ఫూలేతో కలిసి మహిళా విద్య కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు.
• మరణం: 28 నవంబర్ 1890.  

అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతిని జరుపుకుంటారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe