హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

BB6 TELUGU NEWS CHANNEL
నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో హెచ్పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టేందుకు ఈ టీకాను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.ఎవరికీ టీకా?14 ఏళ్లు పూర్తై 15 ఏళ్లలోపు ఉన్న బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నారు.నేటి నుంచే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా కార్యక్రమం ప్రారంభమైంది.ఎందుకు ఈ టీకా? హ్యూమన్ పాపిలోమా వైరస్‌ (HPV) కారణంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ టీకా తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా విస్తృతంగా అమలు చేయనుంది. బాలికల ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.


తల్లిదండ్రులకు సమాచారం…

మీ ఇంట్లో 14  సంవత్సరాల బాలికలు ఉంటే ఈరోజే మీకు దగ్గర్లోని PHC కి తీసుకువెళ్ళండి.
మహిళలు ఇబ్బందిపడుతున్న గర్భాశయ కాన్సర్ రాకుండా బాలికలకు HPV టీకాను ప్రధాని శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ కార్యక్రమం ఈరోజు ప్రధాని శ్రీ మోడీ , ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఇది చాలా విలువైన టీకా.ప్రయివేటు హాస్పిటల్స్ నందు ఈ టీకా ఖరీదు 50 వేలు ఉంటుంది.ఈ టీకా బాలికల భవిష్యత్తు  ఆరోగ్యం కోసం ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఇస్తోంది వినియోగించుకుందాం.

ఆడపిల్ల ఇంటికి వెలుగు.
ఆరోగ్యంగా చూసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe