మృతుడు శివనాగరాజుతో భార్య లక్ష్మీమాధురి దుగ్గిరాల
BB6 TELUGU NEWS CHANNEL
ప్రియుడితో కలిసి భర్తనుచంపేసింది. తర్వాత ఒంటరిగా కూర్చుని రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన ఈ ఘటనకలకలం రేపింది. మంగళగిరి గ్రామీణ సీఐవెంకటబ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై వెంకటరవి ఈ వివరాలుతెలిపారు. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారిలోకం శివనాగరాజు రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనకులక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరుమగపిల్లలు. భార్య విజయవాడలో సినిమాహాల్లో టికెట్కౌంటర్లో పనిచేసేది. ఆ సమయంలో సత్తెనపల్లికిచెందిన గోపితో పరిచయం అయ్యింది. అది వివాహేతరసంబంధానికి దారితీసింది. భర్త వ్యాపారాన్ని నామోషీగాభావించిన ఆమె ఆ వ్యాపారం మాన్పించేసింది. గోపిహైదరాబాద్లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తుండడంతోఅక్కడికి ఉద్యోగానికి పంపింది. కొంతకాలం తర్వాతనాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరు వచ్చేశారు.
దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి.నాగరాజు ఎక్కువగా ఇంటివద్ద నుంచే వ్యాపారంచేస్తుండడంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగామారింది. ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలనిలక్ష్మీమాధురి భావించింది. ఈ నెల 18న రాత్రి ఆమెబిర్యానీ చేసింది. భర్తకు పెట్టే బిర్యానీలో 20నిద్రమాత్రలు పొడిగా చేసి కలిపింది. బిర్యానీ తిన్ననాగరాజు గాఢంగా నిద్రపోయారు. రాత్రి 11.30సమయంలో ప్రియుడు వచ్చాడు. నిద్రపోతున్ననాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా మాధురి దిండుతోముక్కుపై అదిమి నొక్కిపట్టింది. అతడు మృతిచెందాడనినిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోయాడు. ఆ తర్వాతరాత్రంతా మాధురి పోర్న్ వీడియోలు చూస్తూగడిపింది. తెల్లవారుజామున నాలుగు గంటలసమయంలో ఇరుగుపొరుగును పిలిచి.. గుండెనొప్పితోతన భర్త చనిపోయాడని హడావుడి చేసింది.
భార్యాభర్తల మధ్య వివాదాలు, ఆమె వివా హేతరసంబంధం గురించి తెలిసిన ఇరుగుపొరుగువారుఅనుమానించారు. అరగంటలో మృతదేహాన్నిఅంత్యక్రియలకు తరలిస్తారనగా నాగరాజు స్నేహితులువచ్చారు. అతని చెవిలో నుంచి రక్తం రావడం, చెవివద్ద గాయం కనిపించడంతో తండ్రితో పోలీసులకుఫిర్యాదు చేయించారు. ఎస్సై వెంకటరవి కేసునమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.నివేదికలో మృతుని ఛాతీ వద్ద ఎముకలు విరిగిఉండడం, గాలి ఆడకుండా చేయడంతో చనిపోయాడనితేలడంతో పోలీసులు మాధురిని విచారించగా అసలువిషయాలు బయటపడ్డాయి.