BB6 TELUGU NEWS CHANNEL
ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన సాధారణ మార్గదర్శకాలు
1. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన (MCC) షెడ్యూలు ప్రకటించిన తేదీ నుండి ఈ ప్రవర్తన నియమావళి అమలులోనికి వస్తుంది మరియు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అమలులో వుంటుంది.
2. గ్రామములో ఏ అభ్యర్థి గాని వారి అనుచరులు గాని అభ్యర్థి జండాను పాతుటకు, నోటీసు, పోస్టర్లు అతికించుట, స్లోగస్ లు వ్రాయుట చేయరాదు.
3. కులాల ఆధారంగా ఏదైనా వివక్షత రెచ్చగొట్టడం లేదా ప్రసంగాలను, అభ్యర్థులు వారి వ్యక్తిగత జీవితాల ఆరోపణలు చేయకూడదు.
4. అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పుడు ఇతర అభ్యర్థులకు ఆటంకాలు కలిగించకూడదు.
5. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాలకు తేది. 09-12-2025 రోజు సాయంత్రం 5.00 గం. వరకుగడువు.
6. ఎన్నికల ప్రచారానికి వేదికలుగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన మందిరాలు ఉపయోగించకూడదు.
7. సమావేశాల నిర్వహణ మార్గదర్శక నియమాలను పాటించాలి లౌడ్ స్పీకర్లు వాడుకోవడం కోసం మరియు ప్రచారము కొరకు వాహనములకు సంబందించిన అధికారిచే అనుమతులు తీసుకోవాలి.
8. అభ్యర్థులు నిర్వహించే ఊరేగింపులు సమయం, స్థలం వంటి వివరాలు తెలియజేయాలి మరియు సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందిన పిదప ట్రాఫిక్ లేదా సాధారణ ప్రజలకు ఎటువంటి ఆటంకం కలిగించరాదు.
9. ఊరేగింపులలో పాల్గొనే వ్యక్తులు అవాంఛనీయ వస్తువులు అంశాల వాడకాన్ని దిష్టి బొమ్మలను దహనం చేయడం పట్ల కార్యకలాపాలను కూడా నిషేదిస్తుంది.
10. పోలింగ్ రోజు అభ్యర్థులు అనుసరించాల్సిన సాధారణ మార్గదర్శకాలు ఎన్నికలను నిష్పాక్షికంగా స్వేచ్చగా నిర్వహించడానికి అభ్యర్ధులు అధికారులతో సహకరించాలి. పార్టీలు ఓట్లు లేదా పోలింగ్ ప్రక్రియకు భంగం కలిగించకుండా పోలింగ్ బూత్ దగ్గర పార్టీ చిహ్నాలు, ప్రచార సామగ్రి మద్యం వాడకం చేయకూడదు.
11. ముఖ్యంగా డీజే లకు ఎలాంటి అనుమతులు లేవు అతిక్రమించినచో చట్టరీత్యా చర్యలు తీసుకోబడును
MRO ( తాసిల్దార్ )
గండీడ్ మండలము
స్థానిక సంస్థఎన్నికల ప్రవర్తన నియమావళి (MCC) గండీడ్ ఎమ్మార్వో మల్లికార్జునరావు
04
Dec