BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్: ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్యతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో కాలేజీల బంద్ విరమిస్తున్నట్లు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. కాగా,పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల సమాఖ్య బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 7 )ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్యతో ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చర్చలు జరిపారు. తక్షణమే రూ.600 కోట్ల నిధుల విడుదల చేసేందుకు భట్టి అంగీకరించారు. మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లిస్తామని హామీఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రభుత్వ కమిటీ వేస్తామని.. కమిటీలో ప్రభుత్వాధికారులతో పాటు కాలేజీ
యాజమాన్యాల సభ్యులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా ఏ రకమైనా సంస్కరణలు అవసరమో చేపడతామని తెలిపారు. భట్టి ప్రతిపాదనకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అంగీకారం తెలపడంతో చర్చలు సఫలం అయ్యాయి.చర్చలు ఫలించడంతో బంద్
విరమిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో 2025, నవంబర్ 8 నుంచి కాలేజీలు యధావిధిగా నడవనున్నాయి.
డిప్యూటీ CM భట్టితో చర్చలు సఫలం..నవంబర్ 8 నుంచి కాలేజీలు రీ ఓపెన్
08
Nov