సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు  

దేశాన్ని గాని దేశ సైనికులను గాని అవమానిస్తే ఊరుకునేది లేదు  BJP

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహామదాబాద్ మండలం దేశయపల్లి ఎక్స్ రోడ్డు లో రాస్తారోకో నిర్వహించిన బిజెపి నాయకులు . తెలంగాణ ముఖ్యమంత్రి భారత సైనికులను అవమానించే విధంగా ఉన్నాయని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయాలని పిలిపి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా దేశయపల్లి ఎక్స్ రోడ్లో ఉమ్మడి గండేడ్ మహమ్మదాబాద్ మండల పరిధిలోని బిజెపి నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మండల అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి, మూస నర్సింలు మాట్లాడుతూ. దేశ సైనికులను అవమానించే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నామంటే దానికి కారణం దేశ సరిహద్దుల్లో ఎల్లవేళలా మనల్ని రక్షిస్తున్న సైన్యం, అట్లాంటి సైన్యాన్ని ఓట్ల కోసం దూషించడం సరికాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఉమ్మడి మండల అధ్యక్షులు మూస నర్సింలు ,విజయకుమార్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శిలు నరహరెడ్డి, కాశీనాథ్, పవన్, శ్రీను,ఉపాధ్యక్షులు భద్రేశ్వర్, బీజేవైఎం అధ్యక్షుడు రవీందర్, బిజెపి నాయకులు చందు, కృష్ణ పాల్గొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe