BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచేడ్ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య . ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ విశ్వ రత్న యువజనసంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని ఇలాంటి ఆలోచన వచ్చినందుకు గ్రామ యువకులని అభినందించారు. రక్తదానం చేసి మరొక ప్రాణం కాపాడిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల పుల్లారెడ్డి, మాజీ PACS చైర్మన్ రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవులు, వార్డ్ మెంబర్ మేకల సాయిలు, గ్రామ పెద్దలు శివ మల్లప్ప, రాములు గౌడ్, దశరథ్ ,పులిందర్ రెడ్డి, A రాములు గౌడ్, దొడ్డే రాము, శ్రీనివాస్ గౌడ్, సాయి, ఆనంద్, మైసగల్ల అంజి, పిట్ల గోవర్ధన్ , దొడ్డే వెంకట్ ,వడ్ల శ్రీనివాస్ ,నంగి శంకర్, నంగి సాయి, ఇజాజ్ పాషా, మచ్చ వెంకటేష్, దొడ్డే అవినాష్ పాల్గొన్నారు.

