BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద , ధర్నాకు వచ్చిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను, అరెస్ట్ చేస్తున్న పోలీసులు. 5 నెలల నుండి జీతాలు రావడం లేదు , ఎట్లా బ్రతకాలి అంటూ , కంటతడి పెట్టిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు.బాకీలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాము అంటూ ఆవేదన.
మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేసా మినీ, మా జీతాలు మాకు ఇవ్వండని ధర్నా చేస్తే అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు.
5 నెలలుగా జీతాలు రాక, తినడానికి తిండి లేదు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం అని, కిరాణా దుకాణాల్లో కూడా బాకీకి సామాన్లు ఇవ్వడం లేదుదని , జీతాలు రాకుంటే మేమెలా బ్రతకాలంటూ, కన్నీరు పెట్టుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.
