పిడుగుపాటుకు ముగ్గురు బలి పత్తి పొలంలో కూలీలపై పిడుగు పడడంతో ముగ్గురి మృతి

BB6 TELUGU NEWS CHANNEL
జోగులాంబ గద్వాల్‌ జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం పత్తి చేనులో పని చేసుకుంటున్న కూలీలపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని‌ చికిత్స కోసం గద్వాల జిల్లా‌ ఆసుపత్రికి తరలించారు.‌ మృతులను భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ (22), సర్వేశ్‌ (20), సౌభాగ్యమ్మ (40)గా గుర్తించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe