తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, రైతు వేదిక, గండీడ్ గ్రామపంచాయతీ, సొసైటీ మరియు ప్రభుత్వ బాలుర పాఠశాల లో జెండా ఆవిష్కరణ గావించారు.







ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో బి మల్లికార్జున రావు తోపాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి, గండీడ్ మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు భగవంతు రెడ్డి,Pacs చైర్మన్ లక్ష్మీనారాయణ, ఏవో రాధ, మాజీ ఎంపీపీ ఈశ్వర్ గౌడ్, ఎంఈఓ జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి, వెన్నచెడ్ మాజీ సర్పంచ్ బోయిని గోపాల్, బాలయ్య, చెన్నయ్య, ఇతర అధికారులు ఉపాధ్యాయులు ప్రజలు పాల్గొన్నారు.