దేశవ్యాప్తంగా మే 20న మెడికల్ షాపులు బంద్..గండీడ్ ఎమ్మార్వో కు మెమోరాండం

ఆన్లైన్ ఫార్మసీల అక్రమ విక్రయాలు, చైన్ ఫార్ర్మసీల మితిమీరిన డిస్కౌంట్లకు నిరసనగా ఈనెల 20న దేశవ్యాప్త ఫార్మసీ బందూకు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్స్ అండ్డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ( టిటిసిడిఏ) వెల్లడించింది. …

BB6 TELUGU NEWS CHANNEL
భారతదేశంలో: ఆన్లైన్ ఫార్మసీల అక్రమ విక్రయాలు, చైన్ ఫార్మసీల మితిమీరిన డిస్కౌంట్లకు నిరసనగా ఈ నెల 20న దేశవ్యాప్త ఫార్మసీ బందూకు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్అసోసియేషన్ ( టిటిసిడిఏ) వెల్లడించింది.

మహబూబ్నగర్ కెమిస్ట్ అండ్ డ్రాగెస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గండీడ్ ఎమ్మార్వో B మల్లికార్జున రావు కు మెమోరాండం అందజేసిన గండీడ్ మండలం మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి (శ్రీ సాయి శివ మెడికల్ ), k ఆనంద్ (ధన్వంతరి మెడికల్), సతీష్ (హనుమాన్ మెడికల్), శ్రీనివాస్ (చెన్నకేశవ మెడికల్) నరేష్ (హరి ప్రియ మెడికల్), శివ రాములు (సాయిబాబా మెడికల్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిరు వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకం…
నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలు, కార్పొరేట్ చైన్ ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల సాధారణ రిటైల్, హోల్సేల్ కెమిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ ఆవేదనవ్యక్తం చేసింది. ఫార్మా రంగంలో లాభాల మార్జిన్ చాలా పరిమితంగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్లను తట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది చిన్న, మధ్యతరహా వ్యాపారులు నిలదొక్కుకోవడం కష్టంగా మారిందని లేఖలో పేర్కొన్నారు.

ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు…
ఆర్థిక నష్టాలతో పాటు నియంత్రణ లేని ఆన్లైన్ విక్రయాల వల్ల ప్రజారోగ్యం, ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని అసోసియేషన్ హేచ్చరించింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆన్లైన్ మందులు లభిస్తుండటంతో యువత సెల్ఫ్మెడికేషన్ (సొంత వైద్యం)కు అలవాటు పడుతున్నారని తెలిపింది. నాణ్యత లేని, నకిలీ మందులు మార్కెట్లోకి వచ్చే ప్రమాదం పెరిగిందని వెల్లడించింది. మందుల దుర్వినియోగం, డ్రగ్ నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయని పేర్కొంది. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 20న చేపట్టే ఒక రోజు దేశవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని తెలంగాణ కెమిస్ట్స్ అండ్డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి టి. రాజు, కోశాధికారి పి. కృష్ణ కుమార్ పిలుపునిచ్చారు.

అసోసియేషన్ ప్రధాన డిమాండ్లు…

•ఆన్లైన్, చైన్ ఫార్మసీల అనైతిక డిస్కౌంట్ విధానాలపై నియంత్రణ తీసుకురావాలి.

•చిన్న తరహా రిటైల్ వ్యాపారుల మనుగడను కాపాడేలా ట్రేడ్ మార్జిన్లను రక్షించాలి.

•ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నకిలీ, నాణ్యతలేని మందుల సరఫరాను అడ్డుకోవాలి.

•ఆన్లైన్ ప్లాట్ ఫారమ్ల ద్వారా జరిగే అక్రమ,
అశాస్త్రీయ మందుల అమ్మకాలను పూర్తిగా నిరోధించాలి.

•కేంద్ర డ్రగ్స్ కంట్రోల్ జనరల్ (డిసిజిఐ) డ్రాఫ్ట్కమిటీతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫార్మా రంగంలో పారదర్శకత, నైతికవ్యాపార ప్రమాణాలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Related News

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe