ప్రారంభమైన జనగణన..సెల్ఫ్ ఎన్యూమరేషన్ షురూ..మే 10 వరకు నమోదుకు అవకాశం

BB6 TELUGU NEWS CHANNEL జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణలో ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది.

♦️  వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

♦️  జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

♦️ ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ , జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల , సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ సీహెచ్. ప్రియాంకతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe