కార్యకర్తకు ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ గ్రామానికి చెందిన గడ్డమీది రామయ్య నిన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది . చనిపోయిన వార్త తెలియగానే పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం స్థానిక  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుడి పార్థివ దేహానికి పూల దండ వేసి నివాళులర్పించిన తర్వాత 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొండమోని పెద్ద వెంకటయ్య, కొండమోని చిన్న వెంకటయ్య,సాలర్ నగర్. ఆంజనేయులు గౌడ్, గ్రామ సర్పంచ్ ఎడ్లకాడి చిన్న నర్సయ్య,గొడుగు కొండయ్య, సాలార్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాదయ్య, ఇక్బాల్,గడ్డమీది శ్రీనివాస్ మాజీ SMC చైర్మన్,  టి.ఎస్.యు.టి.ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి స్థానిక  పాఠశాల ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, కొండమోని శ్రీనివాస్, వార్డ్ సభ్యులు బింగి బాలయ్య,గొడుగు రాములు తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe