పేదల కోసం ప్రతిమ హాస్పిటల్ బస్సు సేవలు

BB6 TELUGU NEWS CHANNEL
ఉత్తర తెలంగాణలోని అన్ని రంగాలలో ముందున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా అందరికీ తెలిసిందే. అదేవిధంగా పేదలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఉచితంగా వైద్య సేవలు చేస్తూ పలు గ్రామాలకు ఉచిత బస్సు సేవలు అందిస్తూ దానిలోని భాగంగానే వారానికి రెండు మూడు రోజులు పొత్కపల్లి గ్రామం వరకే వచ్చి వెళ్లే ఈ బస్సు ఇప్పుడు ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి విస్తరించటం ఎంతో సౌకర్యంగా ఉందని గ్రామ సర్పంచ్ బొంగోని రమ శ్రీనివాస్ కొనియాడారు. ఇదేవిధంగా ప్రతివారం గ్రామానికి బస్సు వచ్చి వైద్యం అవసరం ఉన్న పేదవారికి సేవలు అందించి ఆరోగ్యం తో తిరిగి ఇంటికి క్షేమంగా చేరే విధంగా తగు జాగ్రత్త లు తీసుకోవాలని కోరారు. ఈ వైద్య సేవలు గ్రామ ప్రజలకు ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తున్నాయాన్నారు.ఈరోజు ఐదుగురు వైద్యం కోసం వెళ్లారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ బొంగోని రమ శ్రీనివాస్ తో పాటు ఉపసర్పంచ్ స్వప్న సంతోష్, ఓదెలదేవస్థానం ధర్మకర్త జీలుక రవి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe