BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వడ్డేగుడిసెలు గ్రామానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు సాలానగర్ ప్రాజెక్ట్ లో పడి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది శుక్రవారం కనిపించకుండా పోయిన వ్యక్తి ఆదివారం ఉదయం సోలార్ నగర్ ప్రాజెక్టులో మృతి చెందినట్టుగా నిర్ధారణ అయింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రుసుంపల్లి గ్రామానికి చెందిన రాములు (40) రెండు రోజుల క్రితం ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఈత రాక ప్రాజెక్టులో పడి మృతి చెందాడని తెలిపారు. ఆదివారం ఉదయం సమీప గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంపై గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.
ప్రమాదవశాత్తు సాలార్ నగర్ ప్రాజెక్ట్ లో పడి వ్యక్తి మృతి
07
Dec