మసీదు స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా బయటపడినవి చూసి ఆశ్చర్యం…

BB6 TELUGU NEWS CHANNEL
మసీదు స్థలంలో నిర్మాణం కోసం తవ్వకాల నిర్వహిస్తుండగా అక్కడే సీతారాముల విగ్రహాలు బయటపడటంతో ప్రాంతంలో కలకలం రేగింది. జామా మసీదు సమీపంలో వెలుగులోకి వచ్చిన ఈ విగ్రహాల వార్త క్షణాల్లోనే చుట్టుపక్కల వ్యాపించడంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ ప్రాంతంలోని ఓ మసీదుకు చెందిన స్థలంలో తవ్వకాలు జరుపుతుడగా ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. తవ్వకాల్లో సీతారాముల విగ్రహాలు బయటపడ్డాయి. సాగర్‌లోని పాపెట్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. కాగా ఈ విగ్రహాలు లభ్యమైన ప్రాంతంలో ఒకప్పుడు ఆలయం ఉండేదని నిరూపణ అయ్యిందని, ఆ స్థలంలో మళ్ళీ ఆలయం నిర్మించాలని తాము కోరుతున్నట్లు సంస్కృతి బచావో మంచ్ నాయకుడు ఒక వీడియోలో తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే హిందూ సమాజానికి చెందిన స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ ఒకప్పుడు ఒక ఆలయం ఉందని, ఆ భూమిని చాలా కాలం క్రితమే కొందరు ఆక్రమించుకున్నారని వారు తెలిపారు. ఈ లోపే ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విగ్రహాలను కనుగొన్న తర్వాత హిందూ సమాజ సభ్యులు అక్కడ పూజలు నిర్వహించారు. కొంతమంది ఆ స్థలంలో ఒక చిన్న వేదికను కూడా నిర్మించి దానిపై విగ్రహాలను ప్రతిష్టించారు. వేదికను తొలగించడానికి తాము అనుమతించబోమని హెచ్చరించారు. దీనిపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని నియంత్రించడానికి, రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా నిరోధించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe