అక్రమంగా నిర్మిస్తున్న మసీదు నిర్మాణాన్ని నిలిపివేయండి విహెచ్పి బిజెపి

BB6 TELUGU NEWS CHANNEL అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదు పనులు నిలిపివేయాలని గ్రామస్థులు, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండమీదితండా రోడ్డు మన్సూర్ పల్లి దగ్గర ముస్లింలు మసీదు నిర్మించేస్థలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గాజుల వెంకటనాగ ప్రసాద్ కు వంశ పారంపర్యంగా సంక్రమించింది. ఆ భూమి పక్కన ఆదే గ్రామానికి చెందిన కొందరు ముస్లింల జాగా ఉంది. దాన్ని వదలి లావాని పట్టా భూమిని ఆక్రమించి మసీదు నిర్మించాలని చూస్తున్నారని, కావున విచారణ జరిపి నిర్మాణ పనులు ఆపాలన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరిరెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లయ్య, బద్రీశ్వర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్, విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు అంజిలయ్య, యాదయ్య, శేఖర్ ఉన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe