గండిడ్‌లో మిన్నంటిన శ్రీరామనవమి వేడుకలు , వెల్లివిరిసిన మత సామరస్యం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రం లో  శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలుగానే కాకుండా, మత సామరస్యానికి అద్దం పట్టే అరుదైన దృశ్యానికి వేదికయ్యాయి. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, కులమతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండాలనే గొప్ప సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి.

ముఖ్యంగా ఈ ఉత్సవాల్లో ముస్లిం సోదరులు సిరాజ్ మరియు అతహర్ హుస్సేన్ స్వచ్ఛందంగా పాల్గొని తమ సోదరభావాన్ని చాటుకున్నారు. . మతం ఏదైనా మానవత్వం ఒక్కటేనని, ఇలాంటి ఐక్యత సమాజానికి ఎంతో అవసరమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ర్యాగరి భగవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగరి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న ఈ సామరస్య వాతావరణాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల విజయవంతంలో గ్రామ యువకులు కేశవులు, శ్రీనివాస్, మోర హన్మంతు, జోగు కృష్ణ, కుమ్మరి శ్రీను, చెందయ్య ,నర్సింహ రెడ్డి, కుమ్మరి రాములు, బాబ్రీ తదితరులు కీలక పాత్ర పోషించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe