గండీడ్ మండలంలో కారు-హస్తం పార్టీలకు దడ పుట్టేలా బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండలంలో రానున్న సంస్థాగత మరియు స్థానిక సంస్థల ఎన్నికలను (MPTC/ZPTC) దృష్టిలో ఉంచుకొని, భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు కె.విజయ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,డా.వెన్న ఈశ్వరప్ప , రాష్ట్ర నాయకులు గిర్మోని శీనన్న , ఏవి రాములు , జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ ,మాజీ ఎంపిపి కొమ్మిరి లక్ష్మయ్య ,కె. వెంకటేష్ మండల పదాధికారులు పాల్గొని, నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

డా.వెన్న ఈశ్వరప్ప మాట్లాడుతూ…
ప్రతి బూత్‌లో కాషాయ జెండా ఎగరాలి! రానున్న MPTC, ZPTC స్థానాలలో బిజెపి జెండా రెపరెపలాడాలి! అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మీ వెంటే నేను అనుక్షణం ఉంటాను,అని భరోసా ఇచ్చారు.
ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశారో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను చిత్తుచిత్తు చేయాలి! అని ఉద్ఘాటించారు.
డా.వెన్న ఈశ్వరప్ప మాటలు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాయి! స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం అని అన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే గెలుపు మనదే ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కె.కృష్ణయ్య, మండల ప్రధాన కార్యదర్శి నరహరి రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ప్రభు నాయక్, మహిళా మోర్చా అధ్యక్షురాలు రాజేశ్వరి ,ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు చాకలి బాలయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకటేష్,ఎస్సీ మోర్చా అధ్యక్షులు నర్సింలు, ఎస్టి మోర్చా అధ్యక్షులు సంతోష్ నాయక్, బీజేవైఎం మండల అధ్యక్షులు రవీందర్, సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి , శ్రీనివాస్, రఘు,కె. నరేష్, భద్రేశ్వర్,గాంగ్య నాయక్,బి. కృష్ణ, ఎస్ శ్రీనివాస్, మహిపాల్, సంగమేశ్వర్, బాలయ్య,డి. రాములు, గోపాల్, శ్రీనివాస్, ఆంజనేయులు, జ్ఞానేశ్వర్, భరత్ కుమార్, తిరుపతి మరియు మండల పదాధికారులు,వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, కార్యదర్శిలు మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe