బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ..

BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ.. బీసీల్లో వర్గాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదన్న మరో పిటిషనర్‌ లాయర్‌ సుదర్శన్‌.. ఇదే చివరి విచారణ కాదు.. అన్ని అంశాలు ప్రస్తావించొద్దు.. మా ఓపికను పరీక్షించకండి.. గంటల కొద్ది అదే అంశాన్ని ప్రస్తావించి మా సమయం వృథా చేయొద్దన్న హైకోర్టు..
హైకోర్టులో పిటిషనర్ల తరపు లాయర్ల వాదనలు పూర్తి.. ప్రభుత్వం తరపున సీనియర్‌ లాయర్‌ అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు.. బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయి.. జీవోపై స్టే ఇవ్వాలని కోరడం సరైంది కాదు.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది.. ఏక సభ్య కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంపు జరిగింది.. 97 శాతం ఇంటింటి సర్వే జరిగింది.. బిల్లును గవర్నర్‌ ఇప్పటివరకు ఆమోదించలేదు.. తిరస్కరించలేదు-అభిషేక్‌ మను సింఘ్వీ.
2019లో EWS 10 శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.. ఫలితంగా రిజర్వేషన్లు 50 శాతం దాటి 60 శాతానికి చేరాయి.. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్నది సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే.. రాజ్యాంగంలో ఎక్కడా ఇలాంటి నిబంధన లేదు-హైకోర్టులో అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు