BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం మరియు ఎమ్మార్పీఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది
ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవై పైన మధ్యాహ్నం ఒక లాయర్ బూటుతో దాడి చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునే చర్యగా భావిస్తా ఉన్నాము ఒక న్యాయమూర్తికే ఈ విధంగా జరిగిందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యను భారత ప్రభుత్వం సుమోటాగా స్వీకరించి తక్షణమే దాడి చేసినటువంటి వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కార్యక్రమంలో గండీడ్ మండల మాజీ జెడ్పిటిసి జంగాల్ల వెంకటయ్య ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, డప్పు కళాకారుల సంఘం మండల గౌరవ అధ్యక్షులు చిట్లపల్లి మహేందర్, గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హస్నాబాద్ వెంకటయ్య గండీడ్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కామి వెంకట్ రాములు మండల ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి జె.వివేకానంధ్, ఎరుకలి సంఘం మండల అధ్యక్షులు రెడ్డిపల్లి చెన్నప్ప, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాగయపల్లి శంకర్, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కామి సంజీవులు,బద్దుల రాములు,అడ్వకేట్ దొడ్డే రాము,కొమ్ము అనిల్ కుమార్, అశోక్ , హస్నాబాద్ కృష్ణయ్య, పసుల మైబు, పెద్దయ్య,డి.చెన్నయ్య, గుముడాల కేశవులు కొప్పుల అప్పి,తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి జరగడం సమాజానికి సిగ్గుచేటు
06
Oct