బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోండి : పిటీషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

BB6 TELUGU NEWS CHANNEL

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు అయిన పిటీషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. సోమవారం (అక్టోబర్ 06) విచారణలో భాగంగా పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం. ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని.. అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు బెంచ్ లో విచారణ ఉన్న క్రమంలోనే.. తమ వాదనలను అక్కడే వినిపించాలని సూచిస్తూ.. పిటీషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి పిటీషన్ ధకలు చేశారు. హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నదని.. హైకోర్టు స్టే ఇవ్వకుంటే ఇక్కడికి వస్తారా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటీషన్లను కొట్టివేసింది సుప్రీంకోర్టు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe