లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డ డోర్నకల్‌ సీఐ రాజేష్

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబాబాద్‌: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డ డోర్నకల్‌ సీఐ రాజేష్.. బెల్లం వ్యాపారి నుంచి రూ.50 వేలు డిమాండ్‌ చేసిన సీఐ.. రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..లంచం తీసుకుంటూ డోర్నకల్‌ సీఐ రాజేష్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. బెల్లం వ్యాపారి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఓ అక్రమ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు బేతోలు ప్రాంతానికి చెందిన వ్యాపారి వద్ద సీఐ రాజేష్ రూ.50 వేలు డిమాండ్‌ చేయగా వ్యాపారి రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు.వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా. సీఐ ఇంట్లో వ్యాపారి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా సీఐ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.


డోర్నకల్‌ సీఐ రాజేష్