ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘వన మహోత్సవం -2025’ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘వన మహోత్సవం-2025’ కార్యక్రమంలో బాగంగా  బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలను నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి

ఈ సందర్భంగా పోచారం గారు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2కోట్ల 75లక్షల ఎకరాలు, ఈ ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలి అంటే సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణం సమతుల్యం ఉండాలి, ఈ ప్రయత్నంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం-2025 కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది

ఇందులో అత్యధికంగా పంచాయతీరాజ్‌ శాఖ 7 కోట్లు, పురపాలక శాఖ 8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఆయా శాఖలు, జిల్లాల వారీగా పలు లక్ష్యాల్ని నిర్దేశించింది. అటవీ, వ్యవసాయ శాఖలు కూడా కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది.

అందుకు గాను ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ప్రభుత్వం నుండి పంపిణీ చేయనున్నారు, పంపిణీ చేసిన మొక్కలను  విద్యార్థినివిద్యార్థులే కాకుండా ఉపాధ్యాయ బృందం, అధికారులు, ప్రతి ఒక్కరు మొక్కలను నాటి ఈ వన మహోత్సవం-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను

Related News