పాలమూరు ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో చదరంగం పోస్టర్ రిలీజ్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

క్రీడలకు మంచి రోజులు వచ్చాయి : ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం లో క్రీడలకు మంచి రోజులు వచ్చాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి  పేర్కొన్నారు.   పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల చదరంగం బోర్డు లను  పంపిణీ చేసే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను  ఎమ్మెల్యే  తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.  అనంతరం ఆయన గారు మాట్లాడుతూ  చదువుతో పాటు  క్రీడల్లో మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు రాణించాలని ఆయన ఆకాంక్షించారు.  ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాలల్లో చెస్ బోర్డ్ లు పంపిణీ చేయడం  అభినందనీయమన్నారు.  అవకాశం ఉంటే విద్యార్థులకు  చెస్ క్రీడలో శిక్షణ తరగతులను నిర్వహించడంతో పాటు పోటీలు నిర్వహించాలని ఫోరం సభ్యులకు సూచించారు.  ఎన్ఆర్ఐ ఫోరం సభ్యులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులలో చదరంగం ఆట మీద ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వారు  తెలిపారు.   ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఎన్ఆర్ఐ ఫోరం కోఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి, శ్రీధర్, రాఘవేంద్ర, వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe