గోదావరి నీళ్ల దొంగలెవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్

BB6 TELUGU NEWS CHANNEL : గోదావరి, కృష్ణా,జలాలపై అసెంబ్లీలో చర్చకు రావాలనిబీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. “గోదావరి నీళ్ల దొంగలెవరో తేలుద్దాం.. అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? ఎదురెదురుగా నిలబడి మాట్లాడుదాం.. ఎవరివి నిజాలు.. ఎవరు జీవోలు ఇచ్చిన్రు.. ఎవరు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిన్రు.. ఎవరు ధోకాచేసిన్రు.. ఎవరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందో చర్చించేందుకుసిద్ధమా?” అని సవాల్ చేశారు.
“ఒకరోజు గోదావరి, రెండో రోజు కృష్ణాజలాల మీద చర్చిద్దాం. ఇందుకోసం ప్రతిపక్ష నేతగా స్పీకర్కు మీరే లేఖ రాయండి. మీకు ఏ తారీఖు వీలవుతుందో అదే రోజు సమావేశాలు పెడదాం” అని చెప్పారు. రైతు భరోసా కింద 9 రోజురూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసిన సందర్భంగా మంగళవారం
సెక్రటేరియెట్ వద్ద ‘రైతు నేస్తం’ పేరుతో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గోదావరి,కృష్ణా నీళ్లలో తెలంగాణకు మరణశాసనం రాసిందే కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. “కేసీఆర్ బోడి సలహాలవల్లే 2016లో బనకచర్లకు పునాదులు పడ్డాయి. 400 టీఎంసీలను బనకచర్లతో హంద్రీనీవాకు తరలించేందుకు ప్రణాళికలు అప్పుడే రూపొందాయి. ఈ విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసింది ముమ్మాటికీ కేసీఆరే. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్ప్రబ్యునల్ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది.
రాష్ట్రం విడిపోయాక చంద్రబాబునాయుడు దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెట్టి.. 512 టీఎంసీలు ఏపీకి అప్పగించి, 299 టీఎంసీలు మాకు సరిపోతాయంటూ సంతకం పెట్టింది.నువ్వు (కేసీఆర్) కాదా..? 2018లో వ్యాప్కోసన్ను నియమించింది నిజంకాదా..? ఇయ్యాల కాగితాలను శాసన సభముందు పెడతా.. నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా..? ఇది తెలంగాణకు శాశ్వత అన్యాయం కాదా..? నీ దిక్కుమాలిన సలహాల వల్లే ఈ దరిద్రం దాపురించినమాట వాస్తవం కాదా..? రోజమ్మ పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయి రత్నాలసీమ చేయండని చెప్పింది నువ్వుకాదా..?” అని నిలదీశారు.

మామ శకుని.. అల్లుడు శనీశ్వరుడు

తెలంగాణకు అన్యాయం జరిగితే తాము బీఆర్ఎస్ లెక్క చూస్తూ ఊరుకోబోమని, కేంద్రానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. “రేవంత్వచ్చాక బనకచర్ల మొదలు పెట్టినట్లు,చంద్రబాబు నాయుడుకు దగ్గరుండి నీళ్లు ఇస్తున్నట్లు.. దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడుతోనే ఉండాలను కుంటే అక్కడనే ఉండేటోణ్ణి కదా. రాహుల్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చేటోడిని. కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాప్రభుత్వం ఎందుకు తెచ్చెటోడిని. కేసీఆర్ లెక్క మేం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్పొచ్చినం. ‘మీరువాళ్లకు (ఏపీ) సహకరిస్తే సుప్రీం కోర్టులో కలుసుకుందాం.. మీ సంగతి, వాళ్ల సంగతి అక్కడ తేల్చుకుందాం’ అని కేంద్రాన్ని హెచ్చరించినం.
ఇదీ మా చిత్తశుద్ధి. నువ్వా (కేసీఆర్)మమ్మల్ని ప్రశ్నించేది?” అని ఫైర్ అయ్యారు. “సచ్చిపోయిన పార్టీకి సంజీవని గోదావరి జలాలే.. సచ్చినోడిని బతికించేది గోదావరి జలాలే అని కేసీఆర్‌కు ఎవరో చెప్పారు. అసెంబ్లీలో అధికారం పోయింది.పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి. శాసన మండలికి పోటీచేయడానికి అభ్యర్థులు దొరకలే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది. ఆ సచ్చిన పాము గోదావరి జలాల సెంటిమెంట్తో మంటలుపెట్టి మళ్లీ బతుకుతుందట” అని మండిపడ్డారు. కేసీఆర్ శకుని మామ అయితే, ఆయన అల్లుడు హరీశ్రవు శనీశ్వరుడు అని విమర్శించారు. “రైతులకుఏం చేశారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.వాళ్లు రైతు బంధు ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మారు. రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మారు. రైతుల పేరుమీద అప్పులు చేశారు… దోపిడీ చేశారు.కాళేశ్వరం పేరుమీద లక్ష కోట్లరూపాయలు కొల్లగొట్టారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలన, 18 నెలల తమపాలన ఎలా ఉందో చర్చ పెట్టాలని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.“పదేళ్ల కేసీఆర్ పాలనను, 18 నెలల మా పరిపాలనను బేరీజు వేసుకోండి. చెట్లకింద, పెండ్లిళ్ల దగ్గర.. దావత్ లోచర్చించండి. 2004లో సోనియా గాంధీ నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది. కోట్లాది రూపాయల కరెంటు బిల్లులు మాఫీ చేసింది. ఇప్పుడు మా ప్రజా ప్రభుత్వం రైతులను మొదటి ప్రాధాన్యంగా తీసుకుంది” అని చెప్పారు. తమ ప్రభుత్వం18 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, జీరో వడ్డీరుణాలు, స్వయం సహాయక సంఘాలకు వ్యాపార అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు.
“మేం వ్యవసాయాన్ని పండుగలా మార్చాం.రైతును రాజుగా చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రాబోయే రోజుల్లో రాజీవ్యువ వికాసం కార్యక్రమంతో యువతను ఆదుకునేందుకు కృషి చేస్తాం. మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతుల. ఆతర్వాత ఆడబిడ్డలకు, తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు ప్రాధాన్యం.కేసీఆర్ ఎగవేసిన రూ.7,625 కోట్ల రైతుబంధు నిధులను మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు నెలల్లోనే రైతుల ఖాతాల్లో వేశాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకురైతు రుణమాఫీ చేశాం. మొదటి సంవత్సరంలోనే 25,35,964 మందిరైతులకు రూ.20,617 కోట్లు వారిఖాతాల్లో వేసి, రూ.2 లక్షల వరకు రైతులపైఉన్న రుణభారం నుంచి విముక్తి
కల్పించాం.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా ‘రైతులు పండించిన వడ్లను మేం కొనం, ఇది మా బాధ్యతకాదు’ అని చెప్పారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మీరు వరి పండించండి..చివరి గింజ వరకు కొంటాం. కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న వడ్లుపండిస్తే రూ. 500 బోనస్ ఇచ్చి కొంటాం’అని మాట ఇచ్చి అమలు చేశాం. మామాట నమ్మి రైతులు 2 కోట్ల 80 లక్షలటన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలిపారు.మా ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500బోనస్ ఇవ్వడమే కాకుండా వడ్ల పైసలు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో వేసింది.పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వేలాది పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడి ను ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వక నిరుద్యోగులు రోడ్డెక్కారు.
కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. వాళ్లు అదానీ, అంబానీలతో పోటీపడేలా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం.వారితో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయిస్తున్నాం. ఒక్క ఏడాదిలో నేరూ. 21 వేల కోట్లు జీరో వడ్డీ రుణాలు ఇప్పించాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, వాళ్లతో వెయ్యి బస్సులను కొనిపించి ఆర్టీసీకి కిరాయికి ఇచ్చాం. 8వేల ఐకేపీ కేంద్రాలను ఆడబిడ్డల చేతుల్లో పెట్టాం.గ్రామాల్లో ఉన్న పాఠశాలలను “అమ్మ ఆదర్శ పాఠశాల” కింద ఆడబిడ్డల చేత పెట్టి పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాం”అని వివరించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe