అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్‌తో మాట్లాడి చిన్నారులకు ప్రతిరోజూ అందిస్తున్న పౌష్టికాహారం, ఆహార మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చిన్నారులకు సమతుల్యమైన పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యమని, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

నేటి చిన్నారులే రేపటి భావి భారత పౌరులు. వారి ఆరోగ్యం, ఎదుగుదల మనందరి బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు.