BB6 TELUGU CRIME NEWS
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం శివారులో ఎన్ హెచ్ 167 హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డు ప్రక్కని చెట్లు నాటే కూలీల పై దూసుకెళ్లిన కారు. మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఇచ్చిన వివరాల ప్రకారం, ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కూలీలు రాథోడ్ ,విజయ్ మరియు అతని భార్య రజిత రోడ్డు పక్కనే చెట్లు నాటే పనిలో నిమగ్నమై ఉండగా కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపల్లి శేఖర్ అనే వ్యక్తి కారు నెంబర్ (TG13 7161) అతివేగంగా అజాగ్రత్తగా కారు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని. గాయపడ్డ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు
సూచన హెచ్చరిక : ( ఉమ్మడి గండేడ్ మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి)
వాహనం నడిపేటప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి అతివేగం వద్దు, ఫోన్ వాడకం నిషేధం, సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ తప్పనిసరి వంటి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.
పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు వేగ పరిమితి: రోడ్డు నిబంధనల ప్రకారం నిర్దేశిత వేగంతో మాత్రమే వాహనం నడపాలి.
మద్యం సేవించి డ్రైవింగ్ వద్దు: తాగి వాహనం నడిపితే మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం.
సెల్ ఫోన్ నిషేధం: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా మెసేజ్ చేయడం పూర్తిగా మానుకోవాలి.
రక్షణ కవచాలు: కారులో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనంపై వెళ్తే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి.
దూరం పాటించడం: ముందున్న వాహనానికి తగినంత దూరం ఉంచాలి, హఠాత్తుగా బ్రేక్ వేయడం తగ్గించాలి.
హెచ్చరికలు మరియు అత్యవసర సూచనలు అలసట లేదా నిద్రమత్తు: ప్రయాణంలో నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే వాహనాన్ని పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలి.
వాతావరణ మార్పులు: వర్షం, పొగమంచు లేదా రాత్రి సమయంలో వేగాన్ని తగ్గించి, హెడ్‌లైట్లు ఆన్ చేయాలి.
వాహన తనిఖీ: బ్రేకులు, టైర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
కొమ్మిరెడ్డి పల్లి గ్రామం NH167 చెట్లు నాటే కూలీలపై దూసుకెళ్లిన కారు, ముగ్గురికి తీవ్ర గాయాలు
04
Aug