BB6 TELUGU NEWS CHANNEL
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తాళం వేసిన ఇళ్లను మరియు ఒంటరిగా ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని భారీగా బంగారం, వెండి, మరియు నగదు దోచుకెళ్తున్న దొంగతనాల ఘటనలు కలకలం రేపుతున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో జూలై 16 తేదీన జరిగిన దొంగతనం పలు అనుమానాలకు దారితీస్తుంది. హైవే ఎన్ హెచ్ 167 కు ఆనుకొని ఉన్న ఇంటిలో సుమారు 12 లక్షల విలువ చేసే బంగారు ,వెండి ,నగదు చోరీ జరిగి 16 రోజులు గడుస్తున్న నిగ్గు తేలని వ్యవహారం. గండీడ్ మెయిన్ రోడ్ లో పంచర్ షాప్ ( సైకిల్ స్టోర్ ) నిర్వహిస్తున్న వెంకట్ రాములు గౌడ్ ఇంట్లో మిట్ట మధ్యాహ్నం దొంగతనం జరిగితే అదే రోజు పోలీస్ మరియు క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించి వెళ్లారు. కష్టపడి రెక్కల కష్టం తో ఒక్కొక్క రూపాయి పోగుచేసుకొని సంపాదించుకున్నదంతా ఒకేసారి దొంగల పాలు అవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దొంగతనం వ్యవహారానికి వారం రోజుల ముందు వెంకట రాములు గౌడ్ తన సొంత పాత ఇంటిని అమ్మి అప్పుగా తెచ్చుకున్నది తిరిగి ఇద్దామని తెచ్చి పెట్టుకున్న డబ్బు ఇంట్లో ఉందని తెలుసుకొని ,పక్కా సమాచారం తెలుసుకున్న వ్యక్తులే దొంగతనానికి తెగబడ్డారని తెలుస్తోంది. పిల్లల కోసం కూడపెట్టుకున్న దంతా ఒకేసారి దొంగతనం కావడంతో గ్రామస్తులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్న తెలంగాణ పోలీస్ శాఖ ఎలాగైనా దొంగలను పట్టుకొని తమ బంగారం, వెండి, నగదును రికవరీ చేస్తారని ఎదురుచూస్తున్న బాధితుడు.
చూడాలి మరి పోలీసులు ఏ విధంగా ఈ వ్యవహారాలు చేదిస్తారో.?
దొంగతనం జరిగి 16 రోజులు గడుస్తున్నా నిగ్గుతెలని వ్యవహారం. బాధితుల ఆవేదన
02
Aug