గండిడ్ లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు నిర్వహించిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన అర్హులైన 74 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.74,08,584 విలువగల కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి గండేడ్ ప్యాక్స్ చైర్మన్ కమతం శ్రీనివాసరెడ్డి గండి వీడు సర్పంచుల సంఘం అధ్యక్షులు రేగరి భగవంతు రెడ్డి, మండల తహసిల్దార్ మల్లికార్జునరావు, రేగరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ నరేందర్ రెడ్డి ఎంపీడీవో మంజుల,tpcc నరసింహారావు  పుల్లారెడ్డి , పులిందర్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సీనియర్లు ప్రజలు పాల్గొన్నారు

Related News

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe