BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఇప్పటివరకు 99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది. జూలై 30న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఓటర్ల నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు చివరి దశకు చేరుకుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 99 శాతం ఫారాల పంపిణీ పూర్తయినట్లు ఆయన ప్రకటించారు.
వెన్నచెడు గ్రామంలో SIR లో పాల్గొన్నారు గండీడ్ ఎమ్మార్వో
ఈ ప్రక్రియ పురోగతిపై సుదర్శన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా సాగుతోందని…. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) విస్తృతంగా పర్యటిస్తున్నారని చెప్పారు. ప్రజల ఇళ్ల వద్దకే ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని, ప్రజలు వీటిని నింపి వీలైనంత త్వరగా బీఎల్ఓలకు సమర్పించాలని ఆయన కోరారు.
జూలై 24 వరకు గడువు.. జూలై 30న ముసాయిదా రాష్ట్రంలో ఓటర్లు తమ వివరాలను పూరించి, ఫారాలను సమర్పించడానికి ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందని సీఈఓ వివరించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన ఫారాలలో 28 శాతం పూరించిన దరఖాస్తులు తిరిగి అధికారులకు అందాయని ఆయన పేర్కొన్నారు.
మిగిలిన 72 శాతం ఫారాలను సేకరించేందుకు రాబోయే 15 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని… జూలై 24 నాటికి ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తిగా ముగుస్తుందని తెలిపారు. ఆ తర్వాత లోపాలు లేని ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 30న అధికారికంగా ప్రచురిస్తామని… ఆ తర్వాత అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు నోటీసుల కాల వ్యవధి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్ల జాబితాను సర్వాంగ సుందరంగా, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కసరత్తు జూన్ 15న డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియతో అధికారికంగా ప్రారంభం కాగా… జూన్ 25 నుంచి బీఎల్ఓల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల సేకరణ (ఎన్యూమరేషన్ డ్రైవ్) ప్రారంభించారు.
గడువు పెంచాలని డిమాండ్… మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేత సోమా భరత్ కుమార్ శుక్రవారం దిల్లీలో కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వ...
BB6 TELUGU NEWS CHANNEL విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా కేవలం లీవ్ లెటర్ సమర్పించి విధులకు గైర్హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం త్వరలో కుటుంబ రిజిస్టర్ సేవను అందుబాటులోకి తీసుకురానుంది. పౌర సేవలను మరింత సులభతరం చేయడం, కుటుంబ వివరాలను ఒ...
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రేకింగ్ న్యూస్ : రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి పనికి ఓ రేటు అన్నట్లు వ్యవహార శైలి కొనసాగు...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండిడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు నిర్వహించిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పరి...
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకోనున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జి...
BB6 TELUGU NEWS CHANNEL నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం గుట్ట దిగువన అర్ధరాత...
BB6 TELUGU NEWS CHANNEL 108 EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వారు వైద్యులు మరియు ఆసుపత్రులపై ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడంలో స్వీయ సంరక్షణ యొక్క ప్రాముఖ్యత...
BB6 TELUGU NEWS CHANNEL తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఆధ్వర్యంలో తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ BLAలతో నిర్వహించిన సమీక్ష సమావ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్న వెంకటయ్య వద్ద రెండు గేదేలు రెండు ఎద్దులు, బర్రె దూడలు ...
BB6 TELUGU NEWS CHANNEL Latest News : విద్యార్థులకు ఊహించని విధంగా ఈనెల జూలై 24వ తేదీన విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వరుసగా మూడు రోజులు పాఠశాల...