BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నంచర్ల గ్రామానికి చెందిన మహేందర్ / తండ్రి అంజలయ్య , అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా పరిగి వైపు నుంచి బైక్‌పై వస్తున్న అదే గ్రామానికి చెందిన సతీష్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహేందర్ ఎడమ కాలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. సతీష్ కు కూడా స్వల్ప గాయాలు కాగా ప్రైవేటు వాహనంలో సంఘటన స్థలం నుంచి వెళ్లిపోయాడని అక్కడే ఉన్న స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఈఎంటి స్వాతి పైలెట్ అక్బర్ అంబులెన్స్ లో అక్కడే ప్రధమ చికిత్స చేసి మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాటసారి పై బైక్ ఢీ వ్యక్తికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
07
Jul