మహబూబ్నగర్ జిల్లా
AHTU(Anti Human Trafficking Unit),
సురక్ష పోలీసు కళాబృందం, షీటీం, ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించిన “బాల పంచాయత్” కార్యక్రమం
BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామం, పల్లవి ఫంక్షన్ హాల్లో “బాల పంచాయత్” కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.
పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచనా విధానం, సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం, సామాజిక బాధ్యతాభావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. బాలల అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పిస్తూ, వారి హక్కులు, బాధ్యతలు, భవిష్యత్ లక్ష్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు:
1. శ్రీమతి డి. జానకి, IPS, జిల్లా పోలీసు సూపరింటెండెంట్, మహబూబ్నగర్
2. శ్రీ పి. వెంకటేశ్వర్లు, SDPO, మహబూబ్నగర్
3. శ్రీ జి.వి. రమణారెడ్డి, DSP, DCRB, మహబూబ్నగర్
4. శ్రీమతి జరీనా బేగం, జిల్లా మహిళా సంక్షేమ అధికారి
5. శ్రీమతి నర్మద, DCPO, మహబూబ్నగర్
6. శ్రీ ఎం.డి. నయీముద్దీన్, CWC సభ్యులు
7. శ్రీ రాజు నాయక్, MEO, మహమ్మదాబాద్ మండలం
8. శ్రీ మల్లికార్జున రావు, తహసీల్దార్, గండీడ్
9. శ్రీ కె. నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
10. శ్రీమతి మానెమ్మ, దేశాయిపల్లి గ్రామ సర్పంచ్
11. శ్రీ రాములు, మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్
12. శ్రీ ఎం. కృష్ణయ్య, ఇన్స్పెక్టర్, AHTU, మహబూబ్నగర్
13. శ్రీ ఐ. సైదారావు, ఇన్స్పెక్టర్, WSW, హైదరాబాద్
14. శ్రీ శేఖర్ రెడ్డి, SHO, మహమ్మదాబాద్
15. యంగిస్తాన్ ఫౌండేషన్ (NGO) ప్రతినిధులు శ్రీమతి జాగృతి, శ్రీజిత
16. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (NGO) ప్రతినిధులు శ్రీమతి చిన్నమ్మ థామస్, శ్రీ విశ్వకాంత్
అదనంగా స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు మరియు 300 మందికి పైగా ప్రజలు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో బాలల సంక్షేమం, బాలల హక్కుల పరిరక్షణ, విద్య ప్రాధాన్యత, బాల్య వివాహాల నివారణ, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి అంశాలపై అవగాహన కల్పించబడింది. పిల్లల అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను విని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా బాలలలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు మరియు సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఒక బలమైన వేదిక ఏర్పడిందని పలువురు అతిథులు అభిప్రాయపడ్డారు.
M. కృష్ణయ్య
ఇన్స్పెక్టర్, AHTU మహబూబ్నగర్
ఇన్చార్జ్ – సురక్ష పోలీసు కళాబృందం & షీ టీమ్స్
మహబూబ్నగర్ జిల్లా

