40 లక్షల వ్యయంతో పాఠశాలలో అదనపు గదులు,సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ₹40 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్‌ను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.


🔹ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR  మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.నూతనంగా నిర్మించిన గదులు,సైన్స్ ల్యాబ్ విద్యార్థులకి ప్రయోజనకరంగా ఉండి,వారికి ప్రయోగాత్మక విద్యలో సహాయపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి , కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగరి శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో మంజుల,గండీడ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు ర్యాగరి భగవంతు రెడ్డి, మండల తహసిల్దార్ బ్రహ్మరౌతు మల్లికార్జునరావు, కొటాల చిన్నయ్య, వెన్నచెడ్ మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe