ఒక్క వారం ఆగండి..వద్దన్నా గ్యాస్ సిలిండర్లు ఇస్తారు

రోజుకు 50 లక్షల బండలు సరఫరా దేశంలో గ్యాస్ కొరత తీరనుంది.. ఓ వైపు ఇతర దేశాల నుంచి భారీగా తరలి వస్తున్న గ్యాస్ నౌకలు.. మరో వైపు ఇండియాలోనే గ్యాస్ ఉత్పత్తి 40 శాతం పెరగటంతో..గ్యాస్ కొరత పూర్తిగా తీరబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

BB6 TELUGU NEWS CHANNEL
అమెరికా, రష్యా, ఆస్ట్రేలియాతోపాటు ఇతర దేశాల నుంచి ఏకంగా 800 ట్రిలియన్ టన్నుల గ్యాస్ ఇండియాకు వస్తుంది. ఇదే సమయంలో మన దేశంలో40 శాతం గ్యాస్ ఉత్పత్తి పెరిగింది. ఈక్రమంలోనే గ్యాస్ సరఫరా అనేది సాధారణ స్థితికి వస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. 2026, మార్చి 26వ తేదీ నాటికి.. అన్ని గ్యాస్ కంపెనీలు.. రోజువారీ గ్యాస్ సిలిండర్ల డెలివరీని 50 లక్షలకు అంటే కంపెనీల నుంచి రోజుకు 50 లక్షల గ్యాస్ సిలిండర్లు బయటకు వస్తున్నాయి. ఆయా కంపెనీలనుంచి ఈ గ్యాస్ బండలు మన గ్రామాలకు పట్టణాలకు నగరాలకు చేరుకోవటానికి నాలుగు, ఐదు రోజులు పడుతుంది. అంటే.. ఎంత లేదన్నా వారంరోజుల్లో గ్యాస్ కొరత అనేది మాయం కాబోతున్నట్లు కేంద్రం లెక్కలు చెబుతున్నాయి.

ఇంధన కొరతపై వస్తున్న తప్పు దుప్రచారాలను నమ్మవద్దని పెట్రోలియం శాఖ సూచించింది. ఇండియా పెట్రోలియం ఉత్పత్తులను శుద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఉందని..అలాంటిది ఇక్కడ ఇంధన కొరత ఉందంటే ఆందోళన చెందవద్దని సూచించింది. ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తులను శుద్ధి చేసే దేశాలలో నాలుగవ స్థానంలో, ఎగుమతి చేసే దేశాలలో ఐదవ స్థానంలో ఉంది. ఇది 150కి పైగా దేశాలకు ఇంధనాన్ని సరఫరా
చేస్తోంది.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దుష్ప్రచార కంటెంట్ కారణంగా సామాన్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు. చమురు కంపెనీ డిపోలు రాత్రంతా పనిచేస్తూనే ఉన్నాయి, నిరంతరం సరఫరాను పెంచడానికి పంపులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.

క్రూడ్ ఆయిల్ సరఫరా కొనసాగుతోంది: హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఇండియా గతంలో కంటే 41కి పైగా సరఫరాదారుల నుండి ఎక్కువ క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి రిఫైనరీ100% కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తోంది. రాబోయే 60 రోజులకు సరిపడా సరఫరాలు ఇప్పటికే సమకూరాయి, ఇంధనం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

సరిపడా నిల్వలు: ఇంధన నిల్వల కేవలం ఆరు రోజులకు మాత్రమే సరిపోయాతయని వచ్చిన నివేదికలు అవాస్తవమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముడి చమురు, ఉత్పత్తులు,
వ్యూహాత్మక నిల్వలతో కలిపి, మొత్తం 74రోజుల రిజర్వ్ సామర్థ్యం, సుమారు 60 రోజుల  వాస్తవ నిల్వ ఉందని తెలిపారు. క్రూడ్ ఆయిల్ సేకరణ కొనసాగుతుండటంతో, దాదాపు రెండు నెలల సరఫరాకు భరోసా వచ్చినట్లు మంత్రిత్వత శాఖ అధికారులు తెలిపారు.

PNG ప్రమోషన్కు LPG కొరతతో సంబంధం లేదు: ఎల్పీజీ వాడుతున్న వాళ్లు పీఎన్జీ కి మారాలనే ప్రచారానికి.. సిలిండర్ కొరతతో సంబంధం లేదని చెప్పారు. పైపుల ద్వారా సరఫరా చేసే సహజవాయువు (PNG) మరింత స్వచ్ఛమైనది,సురక్షితమైనది, తక్కువ ధరకు వస్తుంది.అందుకే దానిని ప్రోత్సహిస్తున్నామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇండియా రోజుకు 92 MMSCMD సహజ వాయువును ఉత్పత్తిచేస్తూ, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. నగర గ్యాస్ పంపిణీ ప్రాంతాలు 2014లో 57 నుండి 300కుపైగా పెరిగాయి, అలాగే గృహ కనెక్షన్లు 25 లక్షల నుండి 1.5 కోట్లకు పైగా పెరిగాయి. LPG సరఫరా సురక్షితంగా ఉందని తెలిపింది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe