BB6 TELUGU NEWS CHANNEL
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహించిన ఫర్ ఆల్ ఉమెన్ అండ్ చైల్డ్ రైట్, ఈక్వాలిటీ అండ్ ఏంపవర్మెంట్ కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు , గురజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖరరెడ్డి, డి.ఎల్.డి.ఓ గబ్రూ నాయక్ పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఐసిడిఎస్ గురజాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించటం జరిగింది. మహిళా దినోత్సవం సందర్బంగా గురజాల నియోజకవర్గం పరిధిలోని ఐసిడిఎస్ మహిళా అధికారులను మరియు గురజాల నియోజకవర్గంలోని, రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిల్లో వివిధ హోదాల్లో వున్న మహిళా నాయకులను యరపతినేని దుశాలవాతో సన్మానించటం జరిగింది.ఈ సందర్బంగా 315 గ్రూప్ లకు 12 కోట్ల 13 లక్షల స్త్రీనిధి రుణాలను అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గంలో వివిధ హోదాల్లో వున్న మహిళా నాయకులు, కార్యకర్తలు, భారీ స్థాయిలో పాల్గొనటం జరిగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
09
Mar