ఏపీ విజయ నెయ్యిపై కల్తీ ఆరోపణలు.. తెలంగాణ విజయ డెయిరీ ఫిర్యాదు

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో విక్రయిస్తున్న ఏపీ విజయ నెయ్యిపై తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ విజయ బ్రాండ్ కారణంగా అసలు విజయ బ్రాండ్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆయన తెలిపారు. తెలంగాణలో ఏపీకి సంబంధించిన సహకార సంఘాలు లేవని పేర్కొన్నారు.
ఏపీ విజయ ఫెడరేషన్ ఇచ్చిన ఫ్రాంచైజీ ద్వారా విక్రయిస్తున్న నెయ్యిని పరీక్షించగా అందులో వెజిటబుల్ ఆయిల్ కల్తీ ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్‌లో తేలిందని చెప్పారు. ఈ కల్తీ నెయ్యి గుజరాత్ నుంచి వస్తోందని ఆరోపించారు.
ఈ విషయంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని గుత్తా అమిత్‌రెడ్డి విమర్శించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe