రెడ్ బుక్ అహంకారంతో పాలన.. అన్నీ మోసాలే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర.. ప్రజల్లోనే ఉంటా : వైఎస్ జగన్

BB6 TELUGU NEWS CHANNEL
ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెడ్ బుక్‌తో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో పాలకులు వ్యవహరిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్లే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని చెప్పారు.‘సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవన్ లేదు.. అన్నీ మోసాలే’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్నారు: వైఎస్ జగన్
ప్రభుత్వ పాఠశాలలు కళ తప్పాయని, గోరుముద్ద పథకంలో నాణ్యత లేకుండా పోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో పెట్టారని, ఆరోగ్యశ్రీని కనుమరుగు చేశారని ఆరోపించారు. 108, 104 సేవలను నిర్వీర్యం చేశారని అన్నారు.తమ ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించిందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర.. ప్రజల్లోనే ఉంటా: వైఎస్ జగన్
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. పాదయాత్ర కాలంలో పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇకపై ప్రతివారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతోనే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నెల లేదా మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుందని, ఈ ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్‌లు మాత్రమేనని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe