హైదరాబాద్: నగరంలోని బేగంబజార్‌లో కల్తీ టీ పొడి, సబ్బు పొడిని తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రసాయనాలను ఉపయోగించి నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.
కల్తీ సరుకులకు ప్రసిద్ధ సంస్థల పేర్లతో ముద్రించిన లేబుళ్లు అతికించి మార్కెట్‌లో అమ్మకాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం గుజరాత్ నుంచి ముద్రిత లేబుళ్లు తెప్పిస్తున్నట్టు గుర్తించారు.
బేగంబజార్‌లోని గుత్తా దుకాణాలకు ఈ నకిలీ టీ పొడి, సబ్బు పొడిని సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
బేగంబజార్ లో నకిలీ కిరాణం వస్తువులు కల్తీ టీ పొడి, సబ్బు పొడి పట్టివేత
04
Mar