యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత తిరిగి తెరుచుకునేది ఎప్పుడంటే..!

BB6 TELUGU NEWS CHANNEL
యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు, అర్చకులు. మంగళవారం (మార్చి 3 ) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ప్రధానాలయంతో పాటు ఉపఆలయాలు,అనుబంధ ఆలయాలు మూసివేశారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 3:20 గంటల నుండి సాయంత్రం 6:47 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూతపడ్డాయి.

యాదగిరిగుట్ట ఆలయం తిరిగి రేపు (మార్చి 4 ) తెల్లవారుజామున ఉదయం 3గంటలకు ఆలయాన్ని తెరిచి గ్రహణ దోషపరిహారార్థం సంప్రోక్షణ ఆలయ శుద్ధి చేయనున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు ఆలయ అధికారులు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe