ఘనంగా సావిత్రిబాయి పూలే 195 వ జయంతి

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి మేడంని సన్మానించిన ఉపాధ్యాయ బృందం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా నయగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3 తారీకు రోజు ఒక రైతు కుటుంబంలో జన్మించింది ఆమెకు తొమ్మిది ఏండ్ల వయసులో జ్యోతిరావు పూలేతో వివాహం అయింది. నిరక్షరాస్యూరాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు పూలే ప్రోత్సాహం తోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసే విద్యావంతురాలు అయింది మహిళల కోసం పూణేలో మొదటి పాఠశాలను స్థాపించింది ఈ పాఠశాల నడపడం అగ్రవర్ణాలకు నచ్చలేదు దీంతో ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద జల్లడం రాళ్లు విసరడం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు పోయిన తర్వాత మార్చుకొని ఇంటికి వచ్చేటప్పుడు బురదతో ఉన్న చీరను కట్టుకొని వచ్చేది. ఈమె  సమాజం కోసం జీవించిన  గొప్ప సంఘసంస్కర్త చదువు ద్వారా మాత్రమే మార్పు వస్తుందని నిరూపించిన గొప్ప మహిళా మూర్తి చివరికి మార్చ్ 10 తారీకు 1897 సంవత్సరంలో చనిపోయింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య బి. మల్లేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe