అన్ని వర్గాల మహిళలకు చదువు నేర్పిన యోధురాలు సావిత్రి బాయి ఫూలే*మాలిలకు ఎస్టి హోదా కోసం ఢిల్లీ దాక పోరాటం సాగిస్తం* కోసిని పాఠశాలలో శ్రమదానం చేసిన ప్రవీణ్ కుమార్*

BB6 TELUGU NEWS CHANNEL
భారతదేశంలో మహిళలందరికీ చదువు నేర్పింది సావిత్రిభాయి ఫూలేనని,ఆధిపత్య వర్గాలు వ్యతిరేకించినా, దాడులు చేసినా వెనక్కి తగ్గకుండా మహిళలకు చదువు నేర్పేందుకు ముందుకు కదిలారని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ రోజు సావిత్రిభాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా కోసిని గ్రామంలోని ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావిత్రి భాయి ఫూలే అంటే చదువు,చదువు అంటే ఫూలే అని తెలిపారు. చదువుతోనే సమాజ మార్పు సాధ్యమని నమ్మి ఫూలే దంపతులు చదువు కొరకు జీవితాంతం కృషి చేశారన్నారు.మహిళలు,పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించడమే ఫూలేకు మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు. సావిత్రిభాయి ఫూలే కేవలం మాలిలకు మాత్రమే కాకుండా సబ్బండ వర్గాలకు చదువు నేర్పిందని పేర్కొన్నారు.

సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా కోసిని గ్రామ పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పాఠశాల పిల్లలకు మంచి ఆట స్థలం,పరిశుభ్రమైన వాతావరణం ఉండాలన్నారు. మన ఊరు మన బడి పథకం కింద కోసిని పాఠశాలకు 13 లక్షల ఫండ్ వచ్చిందని,కానీ పాఠశాల అభివృద్ధి మాత్రం అనుకున్న విధంగా జరగలేదన్నారు.
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు.పాఠశాలకు సున్నం వేయించి త్వరలోనే ఆట స్థలం ఏర్పాటు చేసి,ఆట వస్తువులు కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కోసిని పాఠశాలకు ఉత్తమ పాఠశాలగా అభివృద్ధి చేస్తామన్నారు.

కేసిఆర్ ప్రభుత్వం మహాత్మ జ్యోతిరావు ఫూలే పేరుతో వందల గురుకుల పాఠశాలలు స్థాపించి,విద్యార్థులు నాణ్యమైన చదువు అందించేందుకు కృషి చేశారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పిల్లలను గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష రాయించాలని కోరారు.

మాలిలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని,వారిని ఎస్టీ జాబితాలో చేర్చడానికి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్నారు. ఎస్టీ జాబితా చేర్చేందుకు అవసరమైతే ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ లో సమావేశం పెట్టి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అందుకోసం మాలి కులస్థులందరూ కలిసి కట్టుగా ఉద్యమించాలన్నారు.

నందిగూడ గ్రామంలో సావిత్రి భాయి ఫూలే విగ్రహాన్ని ముఖ్య అతిథిగా హాజరై డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామ నాయకులతో కలిసి జెండావిష్కరణలో పాల్గొన్నారు. 


ఈ కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు,బిఆర్ఎస్ అసెంబ్లీ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు,సీనియర్ ఉద్యమకారులు కొంగసత్యనారాయణ,కోసిని సర్పంచ్ పుల్లభాయి,ఉప సర్పంచ్ సాజిద్,వంజీరి సర్పంచ్ గౌత్రే లక్ష్మి గోపాల్,వార్డు సభ్యులు,రేగులగూడ సర్పంచ్,ఉప సర్పంచ్,వసాకె హన్మంత్,రవిందర్,మహిళ నాయకులు వరలక్ష్మి,కమల,షబానా,ఫాతిమ,బాబాజీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe