వెన్నచేడ్ గ్రామంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండలం,వెన్నచేడ్ గ్రామంలో గ్రామ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.భారతరత్న,అజాతశత్రువు, మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి (సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా ఈరోజు గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో బిజెపి గ్రామ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.
అటల్ జీ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఆయన ఆశయాలను స్మరించుకున్నాము. ‘అంత్యోదయ’ లక్ష్యంతో, సామాన్యుడి సేవలో ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి,నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అటల్ జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు చాకలి బాలయ్య, మండల ఉపాధ్యక్షులు గడ్డమీద మల్కయ్య, గ్రామ శక్తి కేంద్రం ఇంచార్జ్ గొడుగు రాములు, గ్రామ బిజెపి వార్డ్ మెంబర్లు కాకి ఆంజనేయులు, ఒగ్గు నరేష్, గ్రామ బూత్ అధ్యక్షులు బుకలి శ్రీనివాస్, ఎం.నర్సింలు, జ్ఞానేశ్వర్, నవీన్, గ్రామ నాయకులు బసప్ప, గోపాల్, రాములు, గ్రామ బిజెపి పార్టీ యువ నాయకులు బాల్ రాజ్, హరీష్, బుగ్గయ్య, నరేష్,అంజి, కృష్ణ, ఎం.వెంకటేష్,వెంకటేష్, చెన్నయ్య, వెంకటయ్య, బసప్ప మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.