దొంగ పోలీస్.. రికవరీ చేసిన ఫోన్ కాజేసిన కానిస్టేబుల్

BB6 TELUGU NEWS CHANNEL
లాకర్ నుంచి రూ.1.75 లక్షల ఖరీదైన సెల్ఫోన్ మాయం హైదరాబాద్ లో దొంగ ఎత్తుకెళ్లిన ఫోన్ ను పోలీసులు రికవరీ చేస్తే.. దాన్ని కాస్త ఇంటిదొంగ కాజేసిండు. ఈ ఘటన హైదరాబాద్ లోని మెహిదీపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..స్థానిక రైతు బజార్ వద్ద తన ఫోన్ పోయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. స్పందించిన మెహిదీపట్నం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకొని రూ.1.75 లక్షల ఖరైదీన ఫోన్ ను రికవరీచేశారు. దాన్ని కాస్త పోలీస్ స్టేషన్ లోని లాకర్ లో భద్రపరచగా.. అక్కడ డ్రైవర్ గా విధులు నిర్వహించే కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ కాజేసినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారులు కూడా షాక్ అయ్యారు.నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe