BB6 TELUGU NEWS CHANNEL
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను ఆదివారం గండీడ్ క్లస్టర్ జి.పి.లో కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు.
గండిడ్ గ్రామపంచాయతీ కార్యాలయం క్లస్టర్ నందు గండిడ్, జంగం రెడ్డిపల్లి, అంచన్ పల్లి జి.పి ల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటినిని కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారితో మాట్లాడుతూ సర్పంచ్,వార్డ్ సభ్యుల నామినేషన్ల వివరాలు,ఏకగ్రీవ పంచాయతీ,వార్డ్ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అంచన్ పల్లి సర్పంచ్,వార్డ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు జిల్లా కలెక్టర్ పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడుతూ కొత్త గా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలని, ఎన్నికల వ్యయ ఖర్చు రికార్డ్ ఖచ్చితంగా నిర్వహణ చేయాలని సూచించారు
గండిడ్ ఎం .పి.డి.ఓ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రిని, మెటీరియల్ ను పరిశీలించారు.
*ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ*
గండీడ్ మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో పి. ఏ.సి.ఎస్.ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదివారం తనిఖీ చేశారు.
పి. ఏ.సి.ఎస్. ధాన్యం కొనుగోలు కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు లేరు .రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి అక్కడ ఉన్న రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడం లో నిర్లక్ష్యం,
కొనుగోలు పత్రం జారీ చేయటం లేదు,నిన్నటి నుండి ఇక్కడే ఉన్నామని చెప్పారు.కొనుగోలు కేంద్రం ఇంచార్జీపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు
కొనుగోలు కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బస్తాలు తూకం వేసిన వెంబడే కచ్చితంగా కొనుగోలు పత్రాలు తీసుకోవాలని ఒక్కసారి కొనుగోలు పత్రం ఇచ్చిన తర్వాత ఏమైనా సరే బాధ్యత కొనుగోలు కేంద్రం నిర్వాహకులదే వ ఉంటుందని చెప్పారు. మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని,సన్నరకం ధాన్యం కు మద్దతు ధరకు అదనంగా 500 రూ.లు బోనస్ చెల్లిస్తుందని అన్నారు. ప్యాడి క్లీనర్ లను ఉపయోగిస్తున్నారా అని రైతులను అడిగారు.


