పగిడ్యాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పగిడ్యాల్ బోరు కవిత

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో విద్యావంతురాలు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి గౌరవనీయులు శ్రీమతి బోరు కవిత కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అన్ని విధాలుగా
గ్రామ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని డిసెంబర్ 11 తారీఖు జరిగే ఎన్నికలలో ఆలోచన చేసి మీ ఓటు హక్కును వినియోగించుకుని అభివృద్ధికి పట్టం కట్టాలని తెలిపారు. కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్లు వెంకట్ రాములు అంగడి అరుణ దేవి  సర్పంచ్ అభ్యర్థి  బోరు కవిత, చెంచు అంజిలయ్య,చెలిమిళ్ల కృష్ణయ్య, ఎం.శివకృష్ణ ,కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe