అంత్యక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన అంబేద్కర్ సంఘం నాయకులు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ గ్రామంలో రుక్కమొళ్ళ వెంకటమ్మ భర్త పేరు కీర్తిశేషులు రుక్కమొల్ల నరసయ్యకి ముగ్గురు కూతుర్లు ఉండగా అందులో పెద్ద కూతురు 15 సంవత్సరాలు శిరీష అనే అమ్మాయి అనారోగ్యంతో నిన్న రాత్రి చనిపోవడం జరిగింది ఈరోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించే వాళ్ళ స్థితిగతులు పరిశీలిస్తే చాలా పేదవాళ్లు అని చుట్టుపక్కల వాళ్ళు వివరించారు. వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అంత్యక్రియల కోసం ఎంతో కొంత అమౌంట్ ఇద్దామని గ్రూప్ లో మెసేజ్ పెట్టడం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు ఉద్యోగులు వారికి తోచిన సహాయం చేయడం జరిగింది. జమ అయిన 5000 రూపాయలు బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో  ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, చిన్న నర్సయ్య, బాలయ్య దస్తయ్య బాలు వెంకటేష్ పెంటయ్య ఎల్లమ్మ సాయమ్మ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe